వామ్మో.. మహిళను మింగేసిన కొండచిలువ

వామ్మో.. మహిళను మింగేసిన కొండచిలువ

అదృశ్యమైన ఓ వివాహిత కొండ చిలువకు ఆహారంగా మారింది. ఈ ఘటన ఇండోనేషియాలో తాజాగా వెలుగు చూసింది. దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

అదృశ్యమైన ఓ వివాహిత కొండ చిలువకు ఆహారంగా మారింది. ఈ ఘటన ఇండోనేషియాలో తాజాగా వెలుగు చూసింది. దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరీదా అనే 45 ఏళ్ల వివాహితకు నలుగురు పిల్లలు ఉన్నారు. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. దీంతో ఆమె భర్త గ్రామస్థులు, పోలీసుల సాయంతో పరిసరాల్లో వెతికారు. 

ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వస్తువులు అడవిలో ఓ చోట కనిపించడంతో వారు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగా ఓ చోట 5 మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ కనిపించింది. దాని ఉదర భాగంతో ఉబ్బెత్తుగా ఉండటంతో అనుమానం వచ్చి దాని పొట్ట చీల్చి చూశారు. ఇంకేముంది అక్కడున్న వారి కళ్లు బైర్లుకమ్మాయి. అనుకున్నట్లుగా ఆ కొండచిలువ కడుపులో ఫరీదా ఉంది. మొదట ఆమె తలభాగం కనిపించింది. మహిళ ఒంటిపై దుస్తులు కూడా యథాతథంగా ఉన్నాయి. కొండచిలువకు ఆహారంగా మారిన తన ఫరీదాను చూసి ఆమె భర్త కన్నీటి పర్యంతమయ్యాడు.

Read More బ్రిటన్ లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు