తాగునీటిలో డెడ్ బాడీ.. పోలీసులు వచ్చి చూస్తే షాక్..!

తాగునీటిలో డెడ్ బాడీ.. పోలీసులు వచ్చి చూస్తే షాక్..!

 

విశ్వంభర, హనుమకొండః తాగు నీటిలో డెడ్ బాడీ స్థానికులను కనిపించింది. నీటిపై తేలియాడుతోండి. దాదాపు 12 గంటలు అక్కడే ఆ డెడ్ బాడీ ఉండటంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీరా పోలీసులు అక్కడకు వచ్చి చూస్తే వాళ్లకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఎందుకంటే అతను చనిపోలేదు.. బతికే ఉన్నాడు.

Read More రాఘవపురం లో ఉచిత వైద్య శిబిరం

హనుమకొండ లోని రెడ్డిపురం కోవెలకుంటలో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల దాకా నీటిలోనే పడుకున్నాడు. కానీ అతను చనిపోయాడేమో అని భావించిన స్థానికులు కేయూ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు వచ్చి అతను చనిపోయాడేమో అని అతని చేయి పట్టుకుని లాగారు. 

కానీ అతను బతికే ఉన్నాడు. దాంతో అందరూ షాక్ అయిపోయారు. అసలు నీటిలో ఎందుకు పడుకున్నావ్ అని అడిగితే.. రోజూ గ్రానైట్ కంపెనీల్లో 12 గంటలు ఎండకు పని చేసి తట్టుకోలేకపోయానని.. చల్లదనం కోసమే నీటిలో పడుకున్నానని తెలిపాడు. ఆయనది నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆయనకు తిరిగి వెళ్లడానికి డబ్బులు ఇచ్చి పంపించేశారు.