విషాదం.. విద్యుదాఘాతంతో తల్లీకొడుకు మృతి..!

విషాదం.. విద్యుదాఘాతంతో తల్లీకొడుకు మృతి..!

విద్యుదాఘాతానికి గురై తల్లీకొడుకు మృతిచెందారు. ప్రమాదానికి గురైన తల్లిని కాపాడే ప్రయత్నంలో కొడుకు, కూతురు కరెంట్ షాక్ తగిలగా వారిలో తల్లి, కొడుకు మృతిచెందారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై తల్లీకొడుకు మృతిచెందారు. ప్రమాదానికి గురైన తల్లిని కాపాడే ప్రయత్నంలో కొడుకు, కూతురు కరెంట్ షాక్ తగిలగా వారిలో తల్లి, కొడుకు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లికి చెందిన మణెమ్మ(45) ఇంటి వద్ద దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్‌కు గురైంది. 

దీంతో గమనించిన ఆమె కుమారుడు ప్రసాద్, కూతురు శ్రీలత ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారికీ కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో తల్లి మణెమ్మ, కుమారుడు ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. కూతురు శ్రీలతకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Read More ‘అలా ఉంటే అత్యాచారయత్నం కాదు..’ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

Related Posts

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా