కొడుకును కాపాడే ప్రయత్నంలో తల్లి..!

కొడుకును కాపాడే ప్రయత్నంలో తల్లి..!

 చేతికి అందిన కొడుకు ప్రమాదవశాత్తు మునిగిపోతుంటే ఆ తల్లి పేగు బంధం తల్లడిల్లిపోయింది. నాయినా బిడ్డా.. అంటూ చేయి కలిపి కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా మునిగిపోవడంతో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.

  • గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు మృతి 
  • కట్కూరు శివాలయం వద్ద ఘటన
  • మృతులు తెలంగాణలోని అశ్వారావుపేట వాసులు

విశ్వంభర (కుక్కునూరు): వాళ్ళంతా వేకుమున జామునే లేచి బంధుమిత్రులతో కలిసి సుమారు 16 మంది మహాశివుని దర్శనం కోసం 60 కిలో మీటర్ల ఉన్న శివాలయానికి చేరుకున్నారు. ఓ తల్లి కొడుకుకి ఆ చివరి క్షణాలే.. తమ మృత్యువుకు చివరి ఘడియలని ఊహించలేదు. గోదావరి స్నానానికి దిగిన  చేతికి అందిన కొడుకు ప్రమాదవశాత్తు మునిగిపోతుంటే ఆ తల్లి పేగు బంధం తల్లడిల్లిపోయింది. నాయినా బిడ్డా.. అంటూ చేయి కలిపి కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా మునిగిపోవడంతో ఇద్దరూమృత్యువాతపడ్డారు. ఈ హృదయ విషాదకర సంఘటన సోమవారం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని అశ్వారావుపేట మండల కేంద్రానికి చెందిన అల్లంశెట్టి. నాగమణి (45) అనే మహిళ (జ్యూస్ వ్యాపారి)  16 మంది కుటుంబ సభ్యులతో రెండు వాహనాల్లో కట్కూరు శివాలయానికి చేరుకున్నారు. కాగా నాగమణి కొడుకు తేజ శ్రీనివాస్ (23) గోదావరిలోకి స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు మునిగిపోతున్న క్రమంలో తల్లి నాగమణి కాపాడబోయే ప్రయత్నం చేసింది. దీంతో తల్లి కొడుకు ఇద్దరు మునిగి మృత్యువాత పడ్డారు. ఎస్సై లక్ష్మినారాయణ, ఎంపీడీవో శ్రీహరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాలర్ల సాయంతో వెతకగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాలను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లీకొడుకు మృతిచెందడంతో అశ్వారావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More నల్గొండ పై విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి