పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి, హత్య
- చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఘాతుకం
- సీసీఫుటేజీ ఆధారంగా నిందితున్ని పట్టుకున్న పోలీసులు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి లైంగికదాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లిలోని సుల్తానాబాద్ మండల పరిధిలోని ఓ రైస్‌మిల్లులో గురువారం రాత్రి తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను అదే మిల్లులో పనిచేస్తున్న డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు. సమీప చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి అనంతరం బాలికను చంపేశాడు.
దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్ధరాత్రి లేచి చూసేసరికి బాలిక కనపడకపోవడంతో గమనించిన తల్లి తోటి కార్మికులకు ఈ విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024
పెద్దపల్లిలో దారుణం
ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు
పెద్దపల్లి - నిన్న రాత్రి ఓ రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తరప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు.
సమీప పొదల్లోకి తీసుకెళ్లి… pic.twitter.com/V7wl8OuV4v