విహారయాత్రలో విషాదం.. జలపాతంలో పడి హైదరాబాదీ మృతి

విహారయాత్రలో విషాదం.. జలపాతంలో పడి హైదరాబాదీ మృతి

వర్షాలకు జలపాతం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నీటి మధ్యలో ఉన్న రాళ్లపై శ్రవణ్, అతని స్నేహితుడు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. కాలుజారడంతో ఇద్దరూ నీటిలో పడిపోయారు.

సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు జలపాతంలో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన కర్ణాటకలోని హెబ్బె జలపాతం వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన శ్రావణ్ ప్రముఖ ఈ- కామర్స్ కంపెనీలో సిస్టం అనలిస్టుగా పనిచేస్తున్నాడు. స్నేహితులతో టూర్ ప్లాన్ చేసుకుని అద్దెబైక్‌పై కర్ణాటకలోని పర్యాటక కేంద్రాలను చుట్టివచ్చారు. 

కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం చూసేందుకు వచ్చిన స్నేహితులు అక్కడ ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడిపారు. అప్పటి వరకు బాగానే ఉన్నా..  ఇటీవలి వర్షాలకు జలపాతం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నీటి మధ్యలో ఉన్న రాళ్లపై శ్రవణ్, అతని స్నేహితుడు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. కాలుజారడంతో ఇద్దరూ నీటిలో పడిపోయారు.

Read More చెత్త రిక్షా ను ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ సుజాత

నీళ్లలోని రాయి తగిలి శ్రవణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు ఈ స్నేహితులు ఇద్దరినీ ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ తో వచ్చిన పోలీసులు వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రవణ్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో స్నేహితులు శ్రావణ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అందివచ్చిన కొడుకు మృతిచెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా