చార్‌ధామ్ యాత్రలో 52 మంది మృతి 

చార్‌ధామ్ యాత్రలో 52 మంది మృతి 

చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు యాత్రికుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. మే 10 నుంచి చార్‌ధామ్ యాత్ర కొనసాగుతోంది. అంటే 15 రోజుల్లోనే వేలాది మంది భక్తులు దర్శనాలకు పోటెత్తుతున్నారు. అయితే అక్కడ వాతావరణ పరిస్థితులకు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 15 రోజుల్లో ఏకంగా 52 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో వృద్దులే ఎక్కువగా ఉన్నారు. పైగా ఎక్కువ మంది గుండెపోటుతోనే మృతి చెందారు. 

 

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

గంగోత్రిలో ముగ్గురు, యమునోత్రిలో 12 మంది బద్రీనాథ్ లో 14 మంది, కేదార్ నాథ్ లో 23 మంది చనిపోయారన అధికారులు తెలిపారు. ఎక్కువ మంది కేదార్‌నాథ్‌లో చనిపోయారు. కేదార్‌నాథ్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 50 ఏళ్లకు పైబడిన వారు చార్‌ధామ్ యాత్రకు రావాలనుకుంటే మెడికల్ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యం బాగా లేకపోతే రావద్దని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 9,67,302 మంది చార్ ధామ్ యాత్రను సందర్శించారు. 

 

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

కేదార్‌నాథ్‌లో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ ప్రమాదాలు కూడా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నారు. నిన్న కూడా ఓ హెలికాప్టర్ సాంకేతిక సమస్యతో పాటు.. వాతావరణం అనుకూలించక గాల్లో రౌండ్లు వేసింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పింది. కాబట్టి చార్‌ధామ్ యాత్రకు వృద్దుల ఎక్కువగా రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Related Posts