పవన్ కల్యాణ్‌కు ‘వై’ ప్లస్ సెక్యూరిటీ
- పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచిం
- ‘వై’ ప్లస్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు ‘వై’ ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా, ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
మరోవైపు చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సోమవారం ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు సైతం అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించడం విశేషం.