ఈ రోజు రాత్రి ఏపీకి అమిత్ షా.. చంద్రబాబుతో భేటీ..!

ఈ రోజు రాత్రి ఏపీకి అమిత్ షా.. చంద్రబాబుతో భేటీ..!ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. మంగళవారం నాడు చంద్రబాబును ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు. దాంతో చంద్రబాబు రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాతు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పక్ష నేతలు, ఇతర ముఖ్యమైన నేతలు హాజరుకాబోతున్నారు. 

Read More అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

ఏపీకి వీవీఐపీ నేతలు వస్తుండటంతో వారికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు రాత్రే అమిత్ షా ఏపీకి చేరుకోనున్నారు. రాత్రి 10:20 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. వీరిద్దరి మధ్య దాదాపు గంటకంటే ఎక్కువగానే చర్చలు జరగబోతున్నాయి. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వీరు చర్చించబోతున్నారు.

ఏపీ ప్రభుత్వంలో బీజేపీ పాత్ర గురించి వీరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రాత్రి 11:20కి నోవోటెల్ కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు అమిత్ షా. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటి వరకు మంత్రులు ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే అమిత్ షా బీజేపీకి కేటాయించే మంత్రి శాఖలపై చంద్రబాబుతో చర్చిస్తారు. 

 

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా