గంటన్నర వరకు టెన్షన్ వద్దు.. వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ భరోసా!

గంటన్నర వరకు టెన్షన్ వద్దు.. వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ భరోసా!

ఏడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలై పార్టీల వారిగా సీట్లను ప్రకటించాయి. పలాన పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఇంకో పార్టీ వెనకంజలో ఉంటుందని జోస్యం చెప్పాయి.

విశ్వంభర, విజయవాడ:  ఏడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలై పార్టీల వారిగా సీట్లను ప్రకటించాయి. పలాన పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఇంకో పార్టీ వెనకంజలో ఉంటుందని జోస్యం చెప్పాయి. ఇదే మాదిరిగా హైదరాబాద్‌కు చెందిన ఆరా మస్తాన్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను రిలీజ్ చేస్తూ ఏపీలో రెండోసారి వైసీపీనే అధికారం చేపట్టబోతుందని, జగన్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయం అంటూ ప్రకటించింది. వైసీపీకి 94 నుంచి 104 సీట్లు పక్కాగా వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని పేర్కొంది. అయితే నేడు వెలుబడుతున్న ఫలితాలు అందుకు భిన్నంగా వస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికే టీడీపీ కూటమి అధికారం చేపట్టే మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసింది. టీడీపీ 132, జనసేప 19, బీజేపీ 7, వైసీపీ 17 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థులు ఓటమిని అంగీకరిస్తూ కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటి బాటపడుతున్నారు. ఇదే సమయంలో ఆరా మస్తాను నుంచి ఓ ప్రకటన వెలుబడింది. ఫలితాలు అప్పుడే ముగిసిపోలేదని.. మరో గంటన్నర ఓపిక పట్టండి అంటూ తెలిపింది. ఆరా మస్తాన్ ప్రకటనపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ మొదలయ్యాయి. 

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా