హోటళ్లలో కల్తీ, నాసిరకం ఆహారంపై చర్యలు.. 15 లీటర్ల వాడిన వంట నూనె స్వాధీనం

  • బెంగళూరు హైఎండ్ హోటళ్లలో తనిఖీలు.. 132 కిలోల నాసిరకం ఆహారం ధ్వంసం

Karnataka Health Department: కర్ణాటకలోని ప్రముఖ హైఎండ్ హోటళ్లలో ఆహార నాణ్యతపై ఆరోగ్య శాఖ తనిఖీలు కొనసాగిస్తోంది. ఎక్స్‌పైర్ అయిన, నాణ్యత ప్రమాణాలు పాటించని ఆహార పదార్థాలను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం బెంగళూరులోని యూబీ సిటీలో ఉన్న హోటల్ స్కై, రాయల్ చైన్, మద్రాస్ కిచెన్, టెస్కాన్, సెంచెజ్ తదితర హోటళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా వినియోగానికి అనర్హంగా ఉన్న పలు ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. మొత్తం 132 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం వాటిని పారవేయడం లేదా ధ్వంసం చేశారు. అలాగే హోటళ్లలో వినియోగిస్తున్న వంట నూనెను కూడా అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో 15 లీటర్ల వాడిన వంట నూనెను గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read More కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ భేటీ.. భారత అథ్లెట్లకు అభినందనలు

ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో హోటళ్లు నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలకు అందించే ఆహారం తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎక్స్‌పైర్ అయిన లేదా వినియోగానికి అనర్హమైన ఆహారాన్ని విక్రయించినా, వినియోగదారులకు అందించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/national/actions-against-adulterated-substandard-food-in-hotels-seizure-of-15/article-21444