‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం.. నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

  • ఏలూరు జిల్లాకు సీఎం చంద్రబాబు.. టీడీపీ శ్రేణులతో సమావేశం

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కలిదిండిలో నిర్వహించనున్న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను చంద్రబాబు స్వయంగా అందజేయనున్నారు. భూములకు సంబంధించిన హక్కులు, రికార్డుల పరిరక్షణ, రైతులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించడమే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులతో మాట్లాడనున్నారు.

అనంతరం కలిదిండిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. రైతుల సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం తదితర అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు.

Read More రాయదుర్గంలో భారీ చోరీ.. ఇంటికి తాళం వేయాలంటేనే భయపడుతున్న ప్రజలు

మధ్యాహ్నం కైకలూరులో టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి అధికారులు, పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababus-visit-to-eluru-district-today-for-mee-bhoomi-mee/article-21452