భట్టి అనుచరుల వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్యాయత్నం

  • భూమి కోసం రైతుపై వేధింపులు.. పురుగుల మందు తాగిన రైతు

Telangana News: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రైతు జొన్నలగడ్డ మల్లికార్జునరావు తన భూమి విషయంలో కొంతకాలంగా వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించారు. తన భూమిని రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటామని చెబుతూ, ఇతర భూములను వదిలి తన భూమినే లక్ష్యంగా చేసుకుంటున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు తనను వేధిస్తున్నారని రైతు ఆరోపించారు. తనపై దాడి చేయడంతో పాటు, ఈ విషయంపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. “మా వెనక భట్టి విక్రమార్క ఉన్నాడు.. ఏం పీక్కుంటావో పీక్కో” అంటూ తనను బెదిరించినట్లు రైతు ఆరోపించారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తన భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read More కాచిగూడలో గంజాయి విక్రయ ముఠా అరెస్ట్

తనకు న్యాయం జరగడం లేదనే మనస్తాపంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

తన భూమిని రక్షించాలని, తనపై వేధింపులు, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతు కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. భూ వివాదాన్ని అధికారులు నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను తేల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రైతు చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకుల స్పందన తెలియాల్సి ఉంది. భూ సమస్య కారణంగా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/unable-to-withstand-the-harassment-of-bhattis-followers-the-farmer/article-21458