మేడమ్... అది బస్సు కాదు విమానం.. విజిలేసి డోర్ తీయడానికి కండక్టర్ ఉండడు చూసుకోవాలిగా

  • డోర్ కొడితే పైలట్ దిగి డిక్కీలో లగేజ్ పెడతాడనుకున్నారా? భలే స్కెచ్ వేశారు మేడమ్

Moscow Airport: రష్యాలోని మాస్కో షెరెమెట్యేవో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళలు విమానం ఎక్కేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర కలకలం రేపింది. విమానం మిస్ కావడంతో ఆ ఇద్దరు మహిళలు నిబంధనలను పట్టించుకోకుండా నేరుగా విమానాల రాకపోకలకు సంబంధించిన ఏప్రన్ ప్రాంతంలోకి పరుగెత్తినట్లు సమాచారం. వారిలో ఒక మహిళ తన ట్రాలీ బ్యాగ్‌ను లాక్కుంటూ విమానం వైపు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. విమానం అప్పటికే బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా మహిళలు పరిమిత ప్రాంతంలోకి ప్రవేశించడంతో గ్రౌండ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

మహిళలు విమానం వైపు పరుగెత్తడాన్ని గమనించిన గ్రౌండ్ సిబ్బంది వెంటనే విమానం పుష్‌బ్యాక్ ప్రక్రియను నిలిపివేశారు. దీంతో విమానం కదలకుండా ఆపి, ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం భద్రతా సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు అనుమతి లేని ప్రాంతంలోకి ప్రవేశించడం తీవ్ర భద్రతా ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.

Read More ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

విమానం మిస్ కావడంతో దానిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో మహిళలు ఏప్రన్ ప్రాంతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే గ్రౌండ్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనపై విమానాశ్రయ భద్రతా అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/international/madam-its-not-a-bus-its-an-aeroplane/article-21440

Related Posts