ఘనంగా  పండుగ సాయన్న జయంతి 

ఘనంగా  పండుగ సాయన్న జయంతి 

విశ్వంభర , పరిగి: నిజాం నిరంకుశత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొని సాయుధ పోరాటంలో సరికొత్త బహుజన సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్‌హుడ్‌ గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతిని  చౌడపూర్ మండల పరిధిలోని చాకలిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ పటేల్ చెన్నయ్య పాల్గొని పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పండుగల సాయన్న పోరాట స్ఫూర్తిని, ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. పండుగ సాయన్న ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిన్న మేగ్య తండా సర్పంచ్ పద్మ, కొట్యవిజయ్. బాలరాజ్ చెంద్రయ్య. నర్సిములు, రాజు అంజయ్య, చెన్నయ్య, బొక్క చెన్నయ్య, మేకల వెంకటయ్య, రఘు, హనుమంతు తిర్పతియ్య. ప్రశాంత్, నరేష్. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-grand-celebration-of-sayanna-jayanti/article-21281

Tags: