జైల్‌ బరో’కు సంపూర్ణ మద్దతు* సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపును విజయవంతం చేయాలి .

తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిట్టల సత్యం .

విశ్వంభర : మహబూబాబాద్‌  జిల్లా  : రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ నెల 10న దేశవ్యాప్తంగా చేపట్టనున్న ‘జైల్‌ బరో’ కార్యక్రమానికి సీపీఐ(ఎంఎల్‌) చండ్రపుల్లారెడ్డి పార్టీ అనుబంధ తెలంగాణ రైతు కూలీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిట్టల సత్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు .  ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ  రైతులకు సీ2+50 శాతం ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధ భద్రత, ప్రభుత్వ కొనుగోలు హామీ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు వారి జీవనోపాధిని దెబ్బతీసే భారత్‌–అమెరికా సహా అన్ని రకాల స్వదేశీ, విదేశీ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు.వ్యవసాయ కూలీలకు కనీస వేతనంతో పాటు సామాజిక భద్రత కల్పించాలని, ‘కార్పొరేట్లకు లాభాలు.. రైతులకు నష్టాలు’ అనే విధానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సత్యం డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే సంయుక్త కిసాన్‌ మోర్చా, మరో పది జాతీయ కార్మిక సంఘాలు చేపట్టనున్న రైల్‌రోకో, రాస్తారోకో తదితర ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆగస్టు 10న నిర్వహించనున్న ‘జైల్‌ బరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిట్టల సత్యం పిలుపునిచ్చారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/full-support-to-jail-borough-should-make-the-call-of/article-21261

Tags: