రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ మీడియా, పబ్లిసిటీ చైర్మన్ 

విశ్వంభర, హైదరాబాద్ :తెలంగాణ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్‌గా నియమితులైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అతని  నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ పథకాల ప్రచారంపై ముఖ్యమంత్రి ఆయనకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలోకి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మీడియా & పబ్లిసిటీ విభాగం అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేసి, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఈ సందర్భంగా చైర్మన్‌కుసీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tpcc-media-publicity-chairman-who-met-revanth-reddy-politely/article-21246

Tags: