స్పందించేవాడే కవి
విశ్వంభర, హైదరాబాద్: సమకాలీన సమస్యలపై స్పందిస్తూ, అన్యాయాన్ని ప్రశ్నించే వాడే నిజమైన కవి అని గనులు, భూగర్భ శాఖ విశ్రాంత డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ అన్నారు. భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ త్యాగరాయ గానసభలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సాహిత్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘కవితా రామం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ సమాజ హితాన్ని కోరుతూ, సమకాలీన సమస్యలకు పరిష్కార మార్గాలను చూపేలా కవిత్వం ఉండాలని అన్నారు. సమాజంలోని లోపాలను ప్రశ్నిస్తూ మార్పు దిశగా కవులు తమ రచనలు కొనసాగించాలని సూచించారు. సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు ‘వైద్యో నారాయణో హరిః’ సంకలనాన్ని ఆవిష్కరించారు. వైరాగ్యం ప్రభాకర్ ప్రత్యేక అంశాలతో చక్కటి సంకలనాలను వెలువరిస్తున్నారని అభినందించారు. ఆత్మీయ అతిథి ఖండేరావు రమేష్‌రావు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే రచనలు చేయాలని కవులకు సూచించారు. చౌడూరి నరసింహారావు, మోటూరి నారాయణరావు పుస్తకాలపై సమీక్షలు చేశారు. కవితా సమ్మేళనంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు వివిధ అంశాలపై కవితలు వినిపించారు. అనంతరం కవులను శాలువాలు, సర్టిఫికెట్లతో సన్మానించారు.