టీకేఆర్ కాలేజీలో జాతీయస్థాయి ‘క్వాంటం ఎరీనా హ్యాకథాన్–2026’ ప్రారంభం
విశ్వంభర, మీర్‌పేట్: టీకేఆర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయస్థాయి ‘క్వాంటం ఎరీనా హ్యాకథాన్–2026’ ప్రారంభమైంది. ఆగస్టు 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ హరినాథ్‌రెడ్డి, ట్రెజరర్ అమర్‌నాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న యువ ఇంజినీర్లు, పరిశోధకులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు హ్యాకథాన్ వేదికగా నిలుస్తుందన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. హ్యాకథాన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 1,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరిశ్రమల సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిష్కారాలను కనుగొనడంతో పాటు విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలను ప్రోత్సహించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 36 గంటల పాటు నిరంతరాయంగా జరిగే పోటీలో విద్యార్థుల బృందాలు తమ ఆలోచనలకు నమూనాలను రూపొందించి అభివృద్ధి చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామిరెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.