హరీష్‌రావు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి

విశ్వంభర, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటని టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ చనగాని దయాకర్‌ విమర్శించారు. మాజీ మంత్రి హరీష్‌రావు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల కోసం ఆందోళనలు చేసిన యువతపై నాడు లాఠీచార్జీలు, కేసులు పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతూ, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని దయాకర్‌ హితవు పలికారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/harish-rao-should-apologize-to-the-unemployed/article-21252

Tags: