తాగిన మైకంలో ట్రాన్స్ఫార్మర్ ను తాకి ప్రమాదానికి గురి

 సమయానికి 108 వాహనాన్ని రప్పించి ప్రాణాలు కాపాడిన మునిసిపల్ సిబ్బందులు 

 

WhatsApp Image 2024-07-05 at 1.21.55 PM

Read More పార్టీ కార్యాలయం పై దాడి సిగ్గుచేటు: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

విశ్వంభర న్యూస్
కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ (30) అనే యువకుడు శుక్రవారం ఉదయం 7 గంటలకే మద్యం సేవించి కొత్తూరు మున్సిపాలిటీ లోని గతంలో ఉన్న కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తాకడం తో  విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. అక్కడికి సమయానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది మరియు సూపర్వైజర్ రఘు వెంటనే స్పందించి 108 వానాన్ని పిలిచి ప్రమాదానికి గురైన సిద్ధాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ ను ఆసుపత్రికి తరలించారు. మరియు విద్యుత్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమయానికి స్పందించి మానవత్వం చాటుకొని ఒక నిండు ప్రాణం కాపాడిన మునిసిపాలిటీ సిబ్బంధికి అక్కడున్న ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.