ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం

ఏబీవీపీ  ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం

ఏబీవీపీ  ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం
విద్యా శాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గు చేటు -భూతరాజు గణేష్

చండూర్ , విశ్వంభర :- ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చండూరు పట్టణంలో పాఠశాలల బంద్ విజయవంతం అయిందని ఏబీవీపీ నాయకులు భూతరాజు గణేష్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు భూతరాజు గణేష్ మాట్లాడుతూ  విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు.  విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు వారు ఇష్టరితిగా ఫీజులు పెంచుకుంటా పోతున్నారని అన్నారు.  ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని  నియమించి ప్రైవేట్ ఇంటర్నేషనల్, కార్పొరేట్ పాఠశాలలో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిబంధన వ్యతిరేకంగా పాఠశాలల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ కొరత లేకుండా చూడాలి అని ప్రభుత్వ పాఠశాలలో అందజేస్తున్న మధ్యాహ్న భోజనంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి నాణ్యత లేని ఆహారం అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి . విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.  లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ABVP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సాయి, రాజు, ఈశ్వర్ ,భాను, మల్లేష్ ,శ్రీకాంత్, లోకేష్ ,రాకేష్, వంశీ ,సాయి ,మహేష్ తదితరులు పాల్గొన్నారు