మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాంక్ అఫ్ బరోడా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శైలెందర్, సర్వీస్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రవి కుమార్ బ్యాగ్ లు పంపిణి
ఎల్బీనగర్ విశ్వంభర : - ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ఉత్తమంగా రాణించాలని బ్యాంక్ అఫ్ బరోడా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శైలెందర్, సర్వీస్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రవి కుమార్ అన్నారు. బ్యాంక్ అఫ్ బరోడా ఫార్మేషన్ డే సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వీస్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బాగ్స్, మైక్ సెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు ఏకాగ్రత తో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. మోహన్ నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారయణ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు చేయూతను అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వీస్ బ్రాంచ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ కట్టా ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఎ. ఆనంద్ కుమార్, మేనేజర్ వి. రామారావు, అమూల్య, యోగ టీచర్ శ్రీదేవి, ఉపాధ్యాయులు బి. శోభారాణి, సునీతా, అరుణాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు యోగ శిక్షణ మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యోగ టీచర్ శ్రీదేవి యోగా శిక్షణ ఇచ్చారు. వివిధ ఆసనాలను గురించీ వివరించడంతో పాటు విద్యార్థుల చేత చేయించారు.