రుణమాఫీ చేసిన సందర్భంగా అసెంబ్లీలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లడ్డు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య .
విశ్వంభర ,జూలై 24 : - తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మంత్రులకు,శాసన సభ్యులకు ,
ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సారధ్యంలో రైతులకు రుణమాఫీ చేసిన సందర్బంగా ఇతర పార్టీ ప్రజాప్రతినిధులకు,పోలీసులకు,అసెంబ్లీ స్టాఫ్,జర్నలిస్టులకు స్వామి వారి లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు .ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుందన్నారు.రుణమాఫీ చేయడంతో రైతుల కుటుంబాల్లో పండుగ చేసుకుంటున్నారన్నారు.వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ప్రకటించినట్లుగా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారని అన్నారు.31 వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.దీంతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.15 ఆగస్టు తేది వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి,ఇతర మంత్రులకు రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.