రాష్ట్రంలో రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతోంది: ఈటల
- సమస్యలను సీఎంకు చెప్పే పరిస్థితులు లేవు
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
- సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్‌పై మార్నింగ్ వాక్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతోందని మండిపడ్డారు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ పరిధిలోని సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్‌పై మార్నింగ్ వాక్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రబుత్వ పనితీరు ఉండాలే గానీ స్టాటిక్‌గా ఉండకూడదన్నారు. ప్రతీ చరువు ఊరికి కన్నతల్లిలాంటిదని అభివర్ణించారు. అలాంటి చెరువు దుర్గందభరితంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాగునీరు అందించడంతో పాటు రజకులకు చాకిరేవుగా, మత్స్యకారులకు మత్స్యసంపద అయిందని తెలిపారు. అలాంటి చెరువు ఎండిపోవద్దనే చెరువులను కాపాడుతున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో కొట్లాడేవాడినని, అదే సమయంలో సమస్యల పరిష్కరానికి వారి దగ్గరికి వెళ్లే వాడినని గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏ సమస్య వచ్చినా సీఎంకు చెప్పే వాతావరణం ఉండాలే కానీ ఇప్పుడు ఒక సిస్టం లేదని, రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతోందంటూ ఈటల అభిప్రాయపడ్డారు.