కూరగాయల ధరలకు రెక్కలు… పెరగనున్న టమాటా, ఉల్లి ధరలు

కూరగాయల ధరలకు రెక్కలు… పెరగనున్న టమాటా, ఉల్లి ధరలు

గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధరలు పెరిగి నిత్యావసరాలు కొనలేని పరిస్థితుల్లో ఉంటే.. కూరగాయల ధరలు కూడా మధ్యతరగతి వారికి భారంగా తయారయ్యాయి. హైద‌రాబాద్‌లో అయితే ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లను చూసి సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్నారు.

గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధరలు పెరిగి నిత్యావసరాలు కొనలేని పరిస్థితుల్లో ఉంటే.. కూరగాయల ధరలు కూడా మధ్యతరగతి వారికి భారంగా తయారయ్యాయి. హైద‌రాబాద్‌లో అయితే ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లను చూసి సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్నారు. వంట‌కు ప్ర‌ధాన‌మైన ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లు పెర‌గ‌డంతో.. ప్రజలు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

అయితే, గ‌త వారం రోజుల నుంచి ఉల్లి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ట‌మాటా ఉన్న‌ట్టుండి నిన్న‌టి నుంచి భారీ ధ‌ర ప‌లుకుతోంది. నాణ్య‌మైన మొద‌టి ర‌కం ట‌మాటా కిలో రూ. 80 నుంచి రూ. 90 ప‌లుకుతోంది. సెకండ్ క్వాలిటీ ట‌మాటా కిలో రూ. 60 నుంచి 70గా ఉంది. ఇక హోల్‌సేల్ మార్కెట్ల‌లో రూ. 120కి మూడు కిలోల ట‌మామా విక్ర‌యిస్తున్నారు. మరోవైపు కేజీ ఉల్లిపాయ ధ‌ర రూ. 50పైనే ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ. 60కి విక్ర‌యిస్తున్నారు.

Read More డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 22 వ వార్షికోత్సవం