ఎమ్మెల్యే బాలునాయక్ కు రుణపడి ఉంటాం
On
...బైకని రాములు
విశ్వంభర చింతపల్లి జులై 20 : -శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు చింతపల్లి మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి 33/11 కెవి కరెంట్ సబ్ స్టేషన్ ను మంజూరు చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ కు గ్రామ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బైకని రాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి ఎమ్మెల్యే బాలునాయక్ గెలుపుకు అహర్నిశలు కృషి చేసి, గ్రామ ప్రజలు, కార్యకర్తలతో నిరంతరం మమేకమై మండలంలోనే అత్యధిక మెజార్టీ అందించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేయనున్న క్యాబినెట్ విస్తరణలో ఎమ్మెల్యే బాలు నాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలని నిత్యం గ్రామస్తులతో కలిసి, పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు