శ్యాం ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం.
On
పెద్ద శంకరంపేట మండల బిజెపి అధ్యక్షుడు కోణం విట్టల్.
విశ్వంభరా న్యూస్ నారాయణఖేడ్ నియోజకవర్గం జూలై 7 జన సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని. పెద్ద శంకరంపేట మండల బిజెపి అధ్యక్షుడు కోణం విఠల్ అన్నారు... శనివారం పెద్ద శంకరంపేట లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి బిజెపి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కోణం విఠల్ మాట్లాడుతూ అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ అని ఆయన గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు శ్రావణ్ కుమార్ మంగళ కృష్ణ . ఎర్ర శ్రీహరి.. సాయిలు.. బుగుడాల కృష్ణ .. వడితే సుభాష్.. తదితరులు పాల్గొన్నారు.