బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవి.. భార్య, కొడుకు డ్యాన్స్
తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్రమంత్రి పదవులు వరించాయి. అందులో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డితో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఉన్నారు. వీరిద్దరికీ కేంద్రమంత్రి పదవులు దక్కడంతో వారి కుటుంబంలో సంబురాలు చేసుకున్నారు. కాగా కిషన్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు కేంద్రమంత్రిగా పని చేశారు.
ఇప్పుడు బండి సంజయ్ మొదటిసారి కేంద్రమంత్రి కాబోతున్నారు. దాంతో ఆయన కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బండికి కేంద్రమంత్రి పదవి దక్కిన వెంటనే కరీంనగర్ లోని ఆయన ఇంట్లో ఆయన భార్య అపర్ణ, ఆయన కొడుకు భగీరథతో పాటు కుటుంబ సభ్యులు సంతోషంతో డ్యాన్స్ వేశారు.
అపర్ణ మాట్లాడుతూ.. మా జీవితాల్లో ఇదో అత్యుత్తమ క్షణం అంటూ ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందరి కృషి, ప్రార్థనల వల్లే మనం ఇక్కడకు వచ్చాం. బండి సంజయ్ ఇంత పెద్ద పొజీషన్ లోకి రావడం నిజంగా మా అందరి అదృష్టం అంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.