ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్.. సింగరేణిపై ట్వీట్ వార్
ఇప్పుడు తెలంగాణలో ట్విట్టర్ లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ నడుస్తోంది. ఇరువురు గారు అంటూ ట్వీట్ వార్ కు తెరలేపారు. కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
అప్పుడు రేవంత్ రెడ్డి ట్వీట్ ను ఇప్పుడు కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు. అప్పుడు వ్యతిరేకించిన మీరు.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత వేలం పాటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పంపించడం ఏంటని మండిపడ్డారు. అసలు మీలో ఈ మార్పుకు గల కారణాలు ఏంటో తెలియాలంటూ ప్రశ్నించారు.
అయితే ఇదే కేటీఆర్ ట్వీట్ ను సీఎం రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేస్తూ పోస్టు చేశారు. అందులో కేటీఆర్ గారూ.. అని సంబోధిస్తూ పాయింట్ టు పాయింట్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణ, సింగరేణి బొగ్గు గనుల వేలం పాట వేయాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చూస్తే.. అడుగడుగునా అడ్డు పడింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ తెలిపారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ ప్రభుత్వంలోనే కేంద్రం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని, రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందన్నారు. అప్పుడు అరబింద, అవంతిక కంపెనీలకు అప్పగించినప్పుడు భట్టి విక్రమార్కనే వ్యతిరేకించారని.. ఆయన రాసిన లేఖను పోస్టు చేశారు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ ఆస్తులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని తెలిపారు రేవంత్.