మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని "ప్రజావాణి"లో తుంగతుర్తి రవి ఫిర్యాదు

మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని

తక్షణమే విద్యుత్,డ్రైనేజీ,రోడ్ల సమస్యలు తీర్చాలి
 
- పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తుంగతుర్తి రవి

 

22222విశ్వంభర జూలై 22 : - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని  డివిజన్లో నెలకొన్న,డ్రైనేజీ రోడ్లు, విద్యుత్, దోమల నివారణ,మొదలైన సమస్యలను పరిష్కరించాలని పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ప్రజావాణిలో మున్సిపల్ ఏఈ మరియు డిఈ గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు డ్రైనేజీలు పొంగడం, పలు కాలనీలలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యలు, వర్షాలకు కాలనీల రోడ్లు పూర్తిగా గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు,విద్యుత్ సమస్యలు లేకుండా  చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఏఈ గారికి, డిఈ గారి కి  ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తుంగతుర్తి రవి అన్నారు. అలాగే కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న దోమల బెడద వలన ప్రజలు ఎలాంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా రోజూ ఫాగ్గింగ్ చేయాలనీ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో  మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రునాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు యాసారం నగేష్, ఎండీ మజర్, అమర్నాథ్,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు కాలనీల అధ్యక్షులు, కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Read More నాటి వీర నారీల స్ఫూర్తితో ముందుకు సాగాలి..- సున్నితత్వంతో పాటు  శూరత్వం కలిగి ఉండాలి..