బదిలీలు అనేవి సహజమని కానీ విద్యార్థి, ఉపాధ్యాయుల బంధం శాశ్వతం : ఉపాధ్యాయులు
దామెరలో విధులు నిర్వహిస్తూ బదిలీలలో వివిధ పాఠశాలలకు ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం
నాంపల్లి , విశ్వంభర :- గత 10 సంవత్సరాలుగా మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల దామెరలో విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన బదిలీలలో వివిధ పాఠశాలలకు ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. వారిని విద్యార్థులు, తల్లిదండ్రులు ,ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలు, జ్ఞాపికలు , పూల దండలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు తమకు పాఠశాలతో , విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, గ్రామస్తులతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ బదిలీలు అనేవి సహజమని కానీ విద్యార్థి, ఉపాధ్యాయుల బంధం శాశ్వతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు , గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ,విద్యార్థులు బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ పాఠశాలకు అందించిన సేవలను ఘనంగా కీర్తించి ,వారు భవిష్యత్తులో ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు రఘుపతి హెచ్ఎం, చంద్రశేఖర్, సైదులు, దేవేందర్, మల్లేశ్వరి, మంజుల మరియు నూతనంగా పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, యాదయ్య, వెంకటరమణ, జ్యోతి, శ్రీహరి, మహేష్, శ్రవణ్, శిరీష, ఉజ్వల, రవి మరియు దామెర మాజీ సర్పంచ్ దామెర యాదగిరి, దామెర రమేష్, పూదరి కృష్ణ, మియాపురం దేవేంద్ర చారి, గునబోయిన నాగార్జున పాల్గొన్నారు.