మూడు మేకలు సుఫారీ ఇచ్చి భర్తను హ**త్య చేయించిన భార్య
ఈ రోజుల్లో కట్టుకున్న భర్తలనే దారుణంగా హత్యలు చేయిస్తున్న భార్యల ఉదంతాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా మహబూబ్ నగర్ లో కూడా ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తన కూతురు ప్రేమకు అడ్డు వస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తను చంపించింది ఓ భార్య.
జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఆంజనేయులు, భాగ్యలక్ష్మిలకు ఓ కూతురు ఉంది. అయితే కూతురు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడింది. కూతురును తండ్రి వద్దని పలుమార్లు మందలించినా వినకుండా అలాగే సాగిస్తోంది. దాంతో మరోసారి మందలించగా.. అడ్డు వచ్చిన భార్య భాగ్యలక్ష్మిపై చేయి చేసుకున్నాడు భర్త.
తన కూతురు ప్రేమకు అడ్డు వస్తున్నాడని.. తనను కొట్టాడనే కారణంతో భాగ్యలక్ష్మీ తన భర్తను చంపాలంటూ మైసమ్మ అనే మహిళకు 3 మేకలు సుఫారీ ఇచ్చింది. దాంతో మైసమ్మ మరో ఇద్దరి సాయంతో ఆంజనేయులను గొంతు కోసి హత్య చేసింది. తర్వాత అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్యనే చంపించిందని తేల్చారు. భాగ్యలక్ష్మితో పాటు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.