ఏఐటీయూసీ పోరాట ఫలితమే హాస్పిటల్ కార్మికులకు వరం

WhatsApp Image 2024-07-23 at 16.42.50_62448ba9

విశ్వంభర దేవరకొండ జులై 23 : - దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల వేతనాలు పెరగడం ఏఐటీయూసీ కృషి ఫలితమే. ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అన్నారు.  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం దేవరకొండ  హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కార్మికుల వేతనాలను పెంచాలని ఆందోళన నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఈ రోజు హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ రాములు నాయక్ మరియు ఏజెన్సీ కాంట్రాక్టర్ తో జరిగిన చర్చలలో వేతనాలను పెంచుతామని ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్న 7700 నుంచి 10500 ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం కాలంగా టెండర్ లో హాస్పిటల్లో బెడ్ల సంఖ్య పెరగకపోవటం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవరకొండ చుట్టుముట్టు ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రి లేకపోవడం వల్ల ఇక్కడికి పెద్ద  సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారని దీని 200 బేడ్లకు హాస్పిటల్స్ సామర్థ్యాన్ని పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు పిఎస్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని ప్రతినెల జీతాలు ఇవ్వాలని ఆయన కోరారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటియుసి ఎప్పుడూ అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. కాంటాక్ట్ వ్యవస్ట రద్దుచేసి హాస్పిటల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసేందుకు కోసం భవిష్యత్ లో పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కోశాధికారి జూలూరు వెంకటరాములు, మండల కార్యదర్శి ఏ మల్లయ్య, హాస్పిటల్ యూనియన్ నాయకులు ప్రణయ్, బద్రమ్మ, రాణి తారమ్మ, శరదా, మంజుల, శైని, లింగమ్మ, అరుణ, సరిత, జ్యోతి, చందు, చంటి, శ్రీనివాస్, సుజాత, శ్రీలత, సరిత, సంజయ్, సైదమ్మ, పద్మ, జయమ్మ, సాజిదా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం .. హైదరాబాదీ యువకుడు మృతి