మెదక్ లో కొనసాగుతున్న బంద్... భారీగా మోహరించిన పోలీసులు
On
విశ్వంభర,మెదక్ : మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది.. శనివారం జరిగిన ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో ఒకరి పై కత్తి దాడికి నిరసనగా మెదక్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మెదక్ లోని అన్ని హోటల్స్, ఇతర వ్యాపార సంస్థలు మూసి ఉంచారు. శనివారం జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు రాత్రి నుంచే భారీ పోలీస్ బలగాలను దించారు.
మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా పోలీస్ దిగ్బంధంలో ఉంది. ఎక్కడ చూసినా పోలీస్ లే ఉన్నారు. బీజేపీ ఇచ్చిన బంద్ నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు అర్థ రాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం మెదక్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.. పట్టణంలో అంతా ప్రశాంతంగానే ఉన్నట్టు ఐ జీ రంగనాథ్ వెల్లడించారు. ఎస్పీ బాల స్వామి తో పాటు ఇతర పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నారు.
Read More జాబ్ మేళాలో 14 మంది ఎంపిక
Tags: Bandh continues in Medak