రిజర్వేషన్ల జీవో, నోటిఫికేషన్ పైప హైకోర్టు స్టే
On
- రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ నోటిఫికేషన్ జీవో 9 పై మధ్యంతర స్టే ఇచ్చిన హైకోర్టు
- రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలకు నాలుగు వారాల గడువు.
- ప్రభుత్వ కౌంటర్ పై పిటిషనర్ కౌంటర్ వెయ్యడానికి రెండు వారాల గడువు.
విశ్వంభర, తెలంగాణ /హైదరాబాద్ :- స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్, జీవోలపై స్టే ఇస్తూ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.



