ప్రభుత్వం గౌడ గీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్ల రూపాయలు కేటాయించాలి
On
బోలగాని జయరాములు కేజికేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 23 : - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 50 లక్షల గౌడ గీత కార్మిక కుటుంబాల అభివృద్ధికి సంక్షేమానికి 5000 కోట్ల రూపాయలను కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. తేదీ: 23.07.2024 మంగళవారం రోజున ఆత్మకూర్ (ఎం) పట్టణ కేంద్రంలోని గౌడ సంఘం ఆఫీసులో మండల గౌరవ అధ్యక్షులు గడ్డం దశరథ గౌడ్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జయరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేతివృత్తులలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తి అని అట్టి వృత్తిలో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల జనాభా ఉన్నారని వారి అభివృద్ధి కోసం. సంక్షేమానికి ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాలు కల్లుగీత గౌడ కుటుంబాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని మాటల వరకే వారి ప్రకటనలను పరిమిత మవుతున్నాయని నిర్దిష్టంగా ప్రణాళిక బద్ధంగా వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేస్త లేవని విమర్శించారు. ప్రభుత్వాలను మార్చిన చరిత్ర గౌడ కల్లుగీత కార్మికులకు ఉన్నదని గత ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందున గీత కార్మికుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చిందని ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వెంటనే వాటిని అమలు చేయాలని.ప్రతి గీతా కార్మికుడికి మోటార్ బైక్ లు ఇవ్వాలని. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని. కల్లుగీత వృత్తిలో ప్రమాదాలకు గురవుతున్న గీత కార్మికుల ఎక్స్ గ్రేషియాలను ఐదు లక్షల రూపాయల నుండి 10 లక్షలు రూపాయలకు పెంచాలని. నందనంలో నీర ఉత్పత్తి కేంద్రానికి నిధులు కేటాయించి పనులను పూర్తి చేసి ప్రారంభించాలని. గౌడ గీత కార్మికుల కుటుంబాల యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రతి వ్యక్తికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణం అందించాలని గీతా వృత్తిలో హైబ్రిడ్ తాటి ఈత చెట్లను ప్రభుత్వం అన్ని గ్రామాలలో సొసైటీలకు కేటాయించి నాటేలా చర్యలు తీసుకోవాలని. జిల్లాలో ఉన్న పెండింగ్ ఎక్స్ గ్రేషియాలను వెంటనే విడుదల చేయాలని. గీత కార్మికులందరికీ సేఫ్టీమోకులు అందించాలని కోరారు. ఇట్టి సమావేశంలో స్థానిక మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ ని కల్లు గీత కార్మిక సంఘం ఆత్మకూరు(ఎం) మండల కమిటీ పక్షాన సత్కారం సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి చెరుకు మల్లేశం గౌడ్ మండల గౌరవ అధ్యక్షులు గడ్డం దశరథ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి పరకాల అంజయ్య గౌడ్ మండల కోశాధికారి పంజాల నరసయ్య గౌడ్ మండల నాయకులు నాతి రాజు గౌడ్ పంజాల సత్తయ్య గౌడ్ కూరెళ్ళ సుభాష్ గౌడ్ కోల రాములు గౌడ్ ముద్దసాని శంకరయ్య గౌడ్ ముద్దసాని అంజయ్య గౌడ్ దంతూరి యాదగిరి గౌడ్ దంతూరి ఎల్లయ్య గౌడ్ పంజాల స్వామి గౌడ్ బస్వం వీరస్వామి గౌడ్ దంతూరి యాదగిరి గౌడ్ దంతూరి ఎల్లయ్య గౌడ్ లగ్గాని లక్ష్మీనారాయణ గౌడ్ చెరుకు మల్లేశం గౌడ్ మోగులగాని అంజయ్య గౌడ్ సుధాగాని మల్లేశం గౌడ్ బత్తిని నరేష్ గౌడ్ నూనె ముంతల బిక్షపతి గౌడ్ కైరం నరసింహ గౌడ్ రాగటీస్వామి రంగస్వామి గౌడ్ బుడిగ వెంకన్న గౌడ్ పలుసం రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




