అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ..
On
కూకట్ పల్లి విశ్వంభర : ఆల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మబండ పరిధిలోని కమలమ్మ కాలనీ లో గతంలో నిధులు మంజూరై పెండింగ్ వర్క్స్ జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను శుక్రవారం కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా డ్రైనేజీ నిర్మాణ పనులను పక్కప్రణాళికతో పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని కాలనీ వారికి సూచించారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, పాండుగౌడ్, షౌకత్ అలీ మున్నా, సయ్యద్, అగ్రవాసు, వాలి నాగేశ్వరరావు, రాజుగౌడ్, బాలస్వామి సాగర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.