ముఖ్యమంత్రి గారిచ్చారు.. ఎమ్మెల్యే గారు మీరు ఇవ్వండి

ముఖ్యమంత్రి గారిచ్చారు.. ఎమ్మెల్యే గారు మీరు ఇవ్వండి

తలకొండపల్లి,విశ్వంభర:- మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి తను పుట్టిన కల్వకుర్తి నియోజకవర్గానికి 300 కోట్ల దాకా వరాల జల్లు కురిపించారని మరి ఎమ్మెల్యే సొంత గ్రామమైన తలకొండపల్లి  మండలం ఖానాపూర్ గ్రామానికి కూడ నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని స్థానిక బిజెపి నాయకులు పేరుమళ్ల గణేష్ స్థానికులతో కలిసి పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. తలకొండపల్లి మండలం నుండి ఖానాపూర్ గ్రామం మీదుగా ఆమనగలు వరకు డబల్ రోడ్డు మంజూరు చేయాలని  గ్రామంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మురుగు కాలువలను ఊరి బయట వరకు పొడిగించాలని  ప్రాథమిక పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను తీర్చి గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని కోరారు

 

Read More తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలి - డాక్టర్ పిడమర్తి రవి 

Tags: