భవాని సేన ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు. - నేడు శ్రీ గాయత్రీ దేవి అలంకారం
On
విశ్వంభర, చండూర్ : - దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు. పంచమ వార్షికోత్సవాలలో భాగంగా భవాని సేన నిర్వహిస్తున్న ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు , మహిళలు పాల్గొని అమ్మవారి దర్శనమ్ చేసుకుంటున్నారు. అమ్మవారికి నేడు ఇష్టమైన పూలు చామంతులు, వస్త్రం తెలుపు , ప్రసాదం రవ్వకేసరిలను సమర్పించారు. నేడు పూజలో పాల్గొంటున్న భక్తులు కట్టెకోల హనుమంత్ రావు - విజయలక్ష్మి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారి అలంకరణకు చీరను హరిదిప్ సిల్క్ సెంటర్ గంజి శ్రీనివాసులు అందించారు.



