తెలంగాణలో బిసిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
On
మండల బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీహరి డిమాండ్
డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పణ
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 : -
రాష్ట్ర ఓబిసి మోర్చ ఇచ్చిన పిలుపుమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం సమర్పించిన మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీహరి , ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజరాజు కాశీనాథ్ పాల్గొనడం జరిగింది, అలాగే జిల్లా అధికార ప్రతినిధి బొబ్బలా ఇంద్రా రెడ్డి , యూవ మోర్చా మండల అధ్యక్షులు పైళ్ళ ప్రశాంత్, మండల కార్యదర్శిబూడిద నరసింహ, మండల యువమోర్చా ప్రధాన కార్యదర్శి లోడి మహేష్, మండల ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి మధు, బూత్ అధ్యక్షులు లోడి వెంకటయ్య, సహదేవ్,సీనియర్ నాయకులు ఆకుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు