శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం
On
విశ్వంభర, హైదరాబాద్ : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నడియాడిన పరమ పవిత్రమైన పుట్టపర్తిలో వారి శతవర్ష జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్న తరుణంలో అట్టి పరమ పవిత్రమైన జన్మదిన వేడుకలలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది. శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్టుగా అత్యంత ఆనందాన్ని రేవంత్ రెడ్డి తెలియపరచడంతో పాటు స్వామి వారు మానవాళికి చేసిన బృహత్తర సేవలను గుర్తుకు చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్లోబల్ కౌన్సిల్ సభ్యులు చలం , సత్యసాయి సేవా సంస్థల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకట్రావు, రాష్ట్ర ట్రస్ట్ కార్యదర్శి శేషసాయి, జాతీయ కార్యవర్గ సభ్యులు గోపికృష్ణ, సురేష్ పాల్గొన్నారు. 




