తెలంగాణ ఉద్యమ కళాకారుడు వేముల నరేష్ కన్నుమూత.

వేముల నరేష్ మృతి పట్ల తోటి కళాకారులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

హైద్రాబాద్ , విశ్వంభర :-తెలంగాణ ఉద్యమ కళాకారుడు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ మాజీ నాయకుడు వేముల నరేష్ మృతి చెందారు.కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన హైదరాబాదు లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేదికలపై తన పాటలతో ప్రజలను చైతన్య పరిచాడు. ఆయన మృతి పట్ల తోటి కళాకారులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.