తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు 

  • ఆగస్టు 1 నుంచి అమలు 
  • త్వరలో మార్కెట్‌లో భూముల విలువ పెంపు
  • ప్రభుత్వ అధికారుల కసరత్తు 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూములు, స్థిరాస్తుల విలువను పెంచనుంది. భూముల మార్కెట్ వాస్తవ ధర, ప్రభుత్వ ధరకు వ్యత్యాసం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలను అమల్లోకి తేనుంది.

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించేందుకు రేవంత్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రైమరీ సమావేశాన్ని నిర్వహించారు. దశల వారీగా భూముల ధరలను పరిశీలన పూర్తి చేసి జులై 1వ తేదీన కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ఫైనల్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈనెల 23 వరకు మార్కెట్ విలువను సవరణ చేయనున్నారు. మరుసటి రోజు (జూన్ 29) నాటికి కమిటీ ఆమోదం వేయనుంది. ఆ తర్వాత జులై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ తీసుకొని వాటికి పరిష్కారం చూపనున్నారు. 

Read More జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు.. బీజేపీ సంచలన ఆరోపణలు

సవరించిన ధరలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను ముందుగా గుర్తించి వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను ఆధారంగా చేసుకొని విలువను నిర్ధారిస్తారు. రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్‌ ధరలపై అధికారులు అంచనాకు వస్తారు. కమర్షియల్ ఏరియాలు, మెయిన్ రోడ్స్ లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా మార్కెట్ విలువను నిర్ణయిస్తారు.