తెలంగాణ సీఎం అమెరికా పర్యటన ఖరారు..!

విశ్వంభర :- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికాలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారుల బృందం అమెరికాలో పర్యటించనుంది. వచ్చే నెల 3న రాత్రి హైదరాబాద్ నుంచి ఈ బృందం అమెరికా వెళుతుంది. డల్లాస్  సహా వివిధ రాష్ట్రాలలో పర్యటించి, తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తుంది.

అమెరికా పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వివరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి బృందం వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనుంది. ఈ టూర్ లో పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. సీఎం తన పర్యటన ముగించుకుని ఆగస్టు 11న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

Read More మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు