16 సీట్లతో టీడీపీ విశాఖ ఉక్కును కాపాడింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

16 సీట్లతో టీడీపీ విశాఖ ఉక్కును కాపాడింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

 

 

సింగరేణిని ప్రవేట్ పరం చేస్తున్న బీజేపీ
చోద్యం చూస్తున్న రేవంత్ సర్కార్ అంటూ ఆగ్రహం

 

రాష్ట్రంలో బీఆర్ ఎస్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే ఏం చేస్తారని చాలా మంది అన్నారని.. కానీ అదే టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఇప్పుడు కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉందని చెప్పారు కేటీఆర్. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇస్తేనే కేంద్రంలో ఇప్పుడు వారు చెప్పినట్టు వినే పరిస్థితులు వచ్చాయని స్పష్టం చేశారు. 16 సీట్లతోనే టీడీపీ ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుందని చెప్పారు.

Read More అందెల శ్రీరాములు యాదవ్ ను కలిసిన ఫోర్త్ సిటీ భూ బాధిత రైతులు

బీఆర్ ఎస్ కు కూడా 16 సీట్లు ఇచ్చి ఉంటే ఈ రోజు తెలంగాణకు ఎంతో మేలు జరిగి ఉండదన్నారు కేటీఆర్. తెలంగాణలో ఇప్పుడు సింగరేణి గనులను కాంగ్రెస్, బీజేపీలు ఖతం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాయని మండిపడ్డారు. 8 స్థానాలు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు గనుల యాక్షన్ ను అడ్డుకోవట్లేదని మండిపడ్డారు. 

రేవంత్ కు కేసుల భయం ఉందని.. అందుకే ఆపట్లేదన్నారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే సీఎం రేవంత్ ఆ కత్తికి సాన పడుతున్నారని  ఎద్దేవా చేశారు. కేసుల భయంతోనే రేవంత్ నోరు మెదపట్లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. సింగరేణిపై బీఆర్ ఎస్ యాక్షన్ ప్లాన్ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు కేటీఆర్.