పిహెచ్సిలో టాస్క్ ఫోర్స్ సమావేశం
On
విశ్వంభర, నెల్లికుదురు : స్థానిక పిహెచ్ సి లో పిల్లల్లో నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీకి ఈ నెల 10న, డి వార్మింగ్ డే పురస్కరించుకొని మెడికల్ ఆఫీసర్స్ డా.శారద డా.రమ్య ల ఆధ్వర్యంలో గురువారం టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. తహసిల్దార్ కోని చింతల రాజు,ఎంపీడీవో బాలరాజు హాజరై మాట్లాడుతూ.. ప్రత్యేక క్యాంపుల ద్వారా పిల్లలకు మాత్రలు పంపిణీ చేస్తూ డి వార్మింగ్ డే ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మెడికల్ ఆఫీసర్స్ మాట్లాడుతూ..నులిపురుగుల ఎలా వ్యాప్తిస్తాయి,పిల్లల ఆరోగ్యం పై వాటి ప్రభావం సంబంధిత మాత్రలు వేసే విధానం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో ఐసిడిఎస్,ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.