ఐఎంఏ డాక్టర్లు ఆర్ఎంపీ పిఎంపిలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఖండించిన సుశ్రుత గ్రామీణ వైద్యులు
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 20 : -యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని పి ఎస్ గార్డెన్ లో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు సూదగాని లక్ష్మయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మండల అధ్యక్షులు వంగ శ్రీనివాస్ , మండల ప్రధాన కార్యదర్శి అంబటి రాజయ్య మాట్లాడుతూ అర్హత లేని ఆర్ ఎం పి , పి ఎం పి , గ్రామీణ వైద్యులపై అక్కసుతో ఐ ఎం ఏ డాక్టర్లు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండించారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , క్యాబినేట్ మంత్రులు , శాసన సభ్యులు , శాసన మండలి సభ్యులు మాపై ప్రేమతో మేము ప్రజలకు అందించే సేవలను గుర్తించి మాకు శిక్షణ ఇచ్చి గుర్తింపు పత్రాలు ఇస్తామని ముందుకు వచ్చిన సందర్భంలో వాళ్ళకి ఏమి అర్హత ఉంది అని వాళ్ళకి ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వొద్దు అని చెప్పడానికి వీళ్ళు ఎవరు అని ప్రభుత్వాన్నే దిక్కరిస్తున్న వీళ్ళ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . నిత్యం గ్రామాలల్లో గ్రామీణ వైద్యులు డబ్బులు ఇచ్చిన ఇయ్యకున్న మానవత్వ హృదయంతో వారికి వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులపై ఇంత కక్ష పూరితంగా వ్యవరిస్తున్న ఐ ఎం ఏ డాక్టర్ల పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు . గ్రామాలల్లో మీ కుటుంబ సభ్యులకు , మీ బంధువులకు ఇంటికి వచ్చి వైద్య సేవలు అందించే గ్రామీణ వైద్యుల కడుపు మీద కొట్టోద్దు అని గ్రామీణ వైద్యుల కుటుంబాలను రోడ్డున పడేయొద్దు అని వాళ్ళ ఉసురు పోసుకోవొద్దు అని అన్నారు . ఈ కార్యక్రమంలో సుశ్రుత గ్రామీణ వైద్యులు ప్రసాద్ , రవి కిరణ్ , అంజిరెడ్డి , అచ్చయ్య , ఉపేందర్ , లక్ష్మణ్ , మల్లేష్ , ఎల్లారెడ్డి , నరేందర్ తదితరులు పాల్గొన్నారు