జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన సన్ షైన్ విద్యార్థి
On
విశ్వంభర,చండూర్ : నల్గొండ జిల్లాస్థాయిలో నిర్వహించిన అడోలసెన్స్ ఎడ్యుకేషన్ పోస్టర్ మేళా పోటీలో చండూర్ సన్ షైన్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కడారి శరణ్య పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను జిల్లా స్థాయిలో ప్రధమ బహుమతి సాధించడం జరిగింది. అట్టి విద్యార్థినికి జిల్లా జడ్జి రామచంద్రయ్య మెమొంటో, ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నందుకు గాను పాఠశాల యజమాన్యాన్ని మెచ్చుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్నకు , సంబంధిత ఉపాధ్యాయుడు రవికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరస్పాండ్ కోడి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచడం ద్వారా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని పొందవచ్చని అన్నారు.