బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపిన-రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి
విశ్వంభర, పరిగి :- వికారాబాద్ పట్టణ కేంద్రంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్ లో భాజపా జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు విజయ రామారావు తో కలిసి రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ పాల్గొన్నారు.
అనంతరం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి విజయ రామారావును బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహల్లాదరావును పరిగి నియోజకవర్గ బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కేశవులు, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రమేష్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు,ఆంజనేయులు, అనిల్, రాంరెడ్డి, పరిగి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.